బీబీనగర్, ఆగస్టు 19 : నానో యూరియా, నానో డీఏపీ వాడడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చునని బీబీనగర్ మండల వ్యవసాయ అధికారి పద్మప్రియ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో రైతులకు నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒక ఎకరానికి అర లీటర్ నానో మూరియా సరిపోతుందని, లీటర్ నీటికి 2-4 ఎంఎల్ వాడాలన్నారు. నానో యూరియా 80 శాతం నత్రజని మొక్కలకు నేరుగా అందుతుందన్నారు. యూరియా అయితే 50 శాతం వరకు ఆవిరై నీటిలో త్వరగా కరిగిపోతుందన్నారు. రైతులు నానో యూరియా వాడకం ద్వారా ఖర్చులను తగ్గించుకోవచ్చని తెలిపారు.