ఆత్మకూరు(ఎం), అక్టోబర్ 04 : స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం ఆత్మకూర్(ఎం) మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. ఆయన వెంట తాసీల్దార్ లావణ్య, ఎంపీడీఓ రాములు నాయక్, డిప్యూటీ తాసీల్దార్ సఫియుద్దిన్, ఎంపీఓ పద్మావతి, ఆర్ఐ మల్లికార్జునరావు, సూపరింటెండెంట్ లోకేశ్వర్ రెడ్డి ఉన్నారు.