ఆలేరు టౌన్, మార్చి 18: డ్రగ్స్(Drugs )లేని సమాజాన్ని నిర్మిద్దాం, యువత భవిష్యత్తును కాపాడుదామని తెలంగాణ రాష్ట్ర నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆలేరు ఎస్టీవో కట్ట శ్రీనివాస్ అన్నారు. జనని స్వచ్ఛంద సేవా సంస్థ బ్యానర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఆలోచనను ఆచరణలో పెట్టాలనే ఉద్దేశంలో భాగంగా ముందడుగు వేస్తున్న సంస్థ సభ్యులను అభినందించారు.
మాదక ద్రవ్యాలకు బానిసై పెడదారి పడుతున్న యువతను సన్మార్గంలో నడుచుకునేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి విద్యా వ్యవస్థ పై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ నాలాం అయ్యప్ప, మైదాం భాస్కర్,సంస్థ అధ్యక్షులు కుంతావత్ కమలాకర్, సంస్థ సభ్యులు జూకంటి సైదులు, ఆలేటి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.