రాజాపేట, ఏప్రిల్ 21 : పిడుగుపాటుకు జీవాలు కోల్పోయిన గొర్రెల కాపరికి ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ క్యామ మల్లేశం డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని రేణికుంటలో అకాల వర్షాలతో పాటు పిడుగు పడి బండి మల్లయ్యకు చెందిన 50 జీవాలు మృతి చెందగా గొర్రెల కాపరిని ఆయన పరామర్శించారు. వారిని ఓదార్చి ధైర్యంగా ఉండాలని చెప్పారు. అనంతరం రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు సట్టు తిరుమలేష్, కర్రే వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, మండల కురుమ సంఘం అధ్యక్షులు వస్పరి సుధాకర్, మాజీ జడ్పీటీసీలు సుబ్బురు బీరుమల్లయ్య, తోటకూరి అనురాధ, నాయకులు గవ్వల నరసింహులు, గుంటి మధుసూదన్ రెడ్డి, బూరుగు భాగ్యమ్మ, నర్సిరెడ్డి, జెల్లీ నర్సింహులు, నర్సింగ్ రావు రాకెల శ్రీనివాస్, మంగ వెంకటేష్, రేగు సిద్దులు, మరల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.