ఆత్మకూరు (ఎం), నవంబర్ 21 : అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. శుక్రవారం ఆత్మకూరు (ఎం) తాసీల్దార్ కార్యాలయంలో నిర్మించిన ఇందిరమ్మ నమూనా గృహాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంతో పాటు కొరటికల్, సిద్దాపురం, నరసాపురం, రాఘవపురం, కూరెల్ల, రహీంఖాన్ పేట, టి రేపాక, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల్లో పాల్గొన్నారు. పల్లెపహాడ్ లో ఎస్సీ కమ్యూనిటీ హాల్, ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ లావణ్య, హౌసింగ్ డీఈ శ్రీరాములు, డిప్యూటీ తాసీల్దార్ సఫియుద్దీన్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి, మాజీ ఎంపీపీ తండ మంగమ్మ, మాజీ జడ్పీటీసీ నరేందర్ గుప్తా, ఆర్ఐ మల్లికార్జునరావు, ఏఆర్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.