– బీబీనగర్ తాసీల్దార్ శ్యామ్సుందర్రెడ్డికి వినతి
బీబీనగర్, జూన్ 18 : బీబీనగర్ మండలంలోని రాయరావుపేట్ గ్రామంలోని సర్వే నంబర్ 178 రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిలో గతంలో జారీ చేసిన పట్టా పత్రాలను పునరుద్ధరించి, అర్హులైన లబ్ధిదారులకు స్థలాలు కేటాయించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ బొర్ర రమేష్ ఆధ్వర్యంలో తాసీల్దార్ శ్యామ్సుందర్రెడ్డికి గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. సర్వే నంబర్ 178లోని ప్రభుత్వ భూమిని నిరుపేదలకు కేటాయించి, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకంలో వారిని భాగస్వాములను చేయాలని కోరారు. సొంత స్థలం లేని పేద కుటుంబాలకు అక్కడే స్థలాలు కేటాయించి గృహ నిర్మాణానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శివ నాగరాజుగౌడ్, వార్డు సభ్యులు త్రిపురబోయిన జంగమ్మ జంగయ్య, రొంపి ఆనంద్, ఎర్రబెల్లి ప్రకాష్ పాల్గొన్నారు.