చౌటుప్పల్ రూరల్: ఎస్.లింగోటం గ్రామంలో శుక్రవారం కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ సహాయమంత్రి కపిల్ పాటిల్ పర్యటిం చనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఆయన ఇక్కడ కు వస్తున్నారు. దీంతో బుధవారం కలెక్టర్ పమేలా సత్పతి ముందస్తు ఏర్పాట్లను పరిశీలించేందుకు గ్రామాన్ని సందర్శించారు.
కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా వివిధ శాఖల అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లా డుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది, గ్రామంలో పండుగ వాతావరణం తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్తీవారి, జడ్పీసీఈవో కృష్ణారెడ్డి, డీఆర్డీవో పీడీ ఉపేందర్‌రెడ్డి, ఆర్డీవో సూరజ్‌కుమార్, డీఎల్పీవో సాధన, ఎంపీడీవో రాకేశ్‌రావు, సర్పంచ్ ఆకుల సునీత, వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతి పనుల పరిశీలన
రామన్నపేట: వెల్లంకి గ్రామానికి ఈనెల 3వ తేదీన కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ సహాయమంత్రి కపిల్ పాటిల్ రానున్న నేపథ్యంలో గ్రామం లో జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం కలెక్టర్ పమేలాసత్పతి సందర్శించి పరిశీలించారు. రైతువేదిక భవనం, వైకుంఠధామం, పల్లెప్రకృతివనం, గ్రామ నర్సరీలను ఆమె పరిశీలించి పలు సూచనలు అధికారులకు చేశారు.
పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, గ్రామీణ అభివృద్ధి, ఉపాధి హామీ పథకం పనుల ప్రగతిపై అధికారులతో మాట్లాడి వివరాల ను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆమె వెంట డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, ఆర్డీవో సూరజ్‌కుమార్, తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో జలేంధర్‌రెడ్డి, మండల ప్రత్యేక అధికారి బాల్సింగ్, సర్పంచ్ ఎడ్ల మహేందర్‌రెడ్డి, ఏపీవో వెంకన్న పాల్గొన్నారు.
వృద్ధులకు సేవ చేయాలి
చౌటుప్పల్ రూరల్: ప్రతి ఒక్కరూ వృద్ధులకు సేవ చేయాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. బుధవారం మండల పరి ధి పెద్దకొండూర్ గ్రామంలోని సాయియాదాద్రి సేవాశ్రమం అదనపు భవన భూమిపూజ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. వృద్ధులకు నూతన వస్ర్తాలను బహుకరించి ఆశ్రమ ఆవరణంలో మొక్కలు నాటారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ ఆశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కాయితీ రమేశ్‌గౌడ్, ఎంపీటీసీ బద్దం కొండల్‌రెడ్డి, ఆశ్రమ వ్యవస్థాపకుడు మేరెడ్డి సత్యనారాయణరెడ్డి, జానకమ్మ, ప్రెసిడెంట్ దెబ్బడి అశోక్ తదితరులు పాల్గొన్నారు.