భూదాన్ పోచంపల్లి, జూన్ 10 : ఈ నెల 12న గ్రామీణ పర్యాటక కేంద్రమైన భూదాన్ పోచంపల్లికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రాష్ట్ర చేనేత జౌళి శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్, ఇoదుమతి, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మ ఏర్పాట్లను పరిశీలించారు. టూరిజం పార్క్, వినోబా మందిరం, చేనేత కార్మికుల గృహాలను వారు పరిశీలించారు. చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. భూదానోద్యమం, పోచంపల్లి ఇక్కత్ వస్త్ర పరిశ్రమ, కార్మికుల జీవన స్థితిగతులను గవర్నర్కు తెలియజేయనున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత జౌళి శాఖ ఏడీ శ్రీనివాసరావు, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, మండల తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్ రెడ్డి , జిల్లా చేనేత జౌళి శాఖ రాజేశ్వర్ రెడ్డి, డీఓ టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుడు భారత లవకుమార్, పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ తడక రమేశ్, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకo పాండు, నాయకుడు బొమ్మ హరిశంకర్ పాల్గొన్నారు.
Bhoodan Pochampally : ఈ 12న పోచంపల్లికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాక