రాజాపేట ఏప్రిల్ 18 : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ప్రతి గింజను కొనుగోలు చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాల్నారు.
ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని కోరారు. అందుబాటులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ చింతలపూరి భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ కాకాలా ఉపేందర్, బ్యాంక్ సీఈఓ సిల్వర్ శేఖర్, మాజీ ఎంపిటిసి బుడిగే రేణుక, రైతులు పాల్గొన్నారు.