రాజాపేట, నవంబర్ 23 : మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆదివారం భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని తెలిపారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో డీఆర్డీఓ నాగిరెడ్డి, తహసిల్దార్ అనిత, డీపీఎం ఫైనాన్స్ వెంకటేశం, ఏపీఎం మురహరి ఏఎంసీ డైరెక్టర్లు విఠల్ నాయక్, మండల సమాఖ్య అధ్యక్షురాలు మేక లత, కార్యదర్శి కనుగంటి సునీత, సీసీలు వెంకటేష్, గౌరీశంకర్, వీవోఏలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.