యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్యాస్ కొనసాగుతున్న కష్టాలు కొనసాగుతున్నాయి. మోత్కూరు భారత్ గ్యాస్ గోడౌన్ వద్ద వినియోగదారులు వంటగ్యాస్ కోసం బారులు తీరారు. గత రెండు మూడు రోజులుగా వంట గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. గురువారం కార్యాలయానికి గ్యాస్ వస్తుందన్న సమాచారం తెలుసుకున్న వినియోగదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
గ్యాస్ సిలిండర్ బండలతో బారులు తీరారు. మోత్కూర్ భారత్ గ్యాస్ గోదాం పరిధిలో 18 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. సకాలంలో గ్యాస్ అందకపోవడంతో ఆరు మండలాల పరిధిలోని వినియోగదారులు గ్యాస్ కోసం వచ్చి పడిగాపులు కాస్తున్నారు.