రామన్నపేట, జనవరి 26 : రామన్నపేట మండల తాసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె.గాలయ్య ఉత్తమ ఉద్యోగ అవార్డు అందుకున్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా విధి నిర్వహణలో ప్రజల మన్ననలు పొందిన ఉద్యోగులకు ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా గాలయ్య ఉత్తమ ఉద్యోగ అవార్డును అందుకున్నారు. దీంతో తాసీల్దార్ లాల్ బహుదూర్, నాయబ్ తాసీల్దార్ శైలజ, ఆర్ ఐ శోభ, రెవిన్యూ సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు, అధికారులు అభినందనలు తెలిపారు.