బీబీనగర్, మే 26 : బీబీనగర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ గోలి నరేందర్ రెడ్డి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అలాగే ఇందిరమ్మ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంతకాలం తనకు అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మిత్రులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాసేవ లక్ష్యంగా చేసిన తన ప్రయాణంలో అందరి సహకారం ఎంతో బలాన్నిచ్చిందన్నారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమైందేనని స్పష్టం చేశారు. భవిష్యత్లో కూడా ప్రజలకు సేవ చేయాలనే తన సంకల్పం కొనసాగుతుందని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ప్రతి సందర్భంలో మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన పేర్కొన్నారు.