రాజాపేట, మార్చి 22 : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని నెమీలే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నియోజకవర్గ యువజన నాయకుడు మోత్కుపల్లి బాలకృష్ణ ఇటీవల ప్రమాదానికి గురయ్యాడు. హైదరాబాద్ మెడిసిటీ దవాఖానాలో చికిత్స పొందుతున్నాడు.
విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి శనివారం ఆస్పత్రికి వెళ్లి బాలకృష్ణను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఆమె వెంట బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్, సెక్రటరీ జనరల్ సందిల భాస్కర్ గౌడ్, మన్నె ప్రభాకర్, వరిమడ్ల బాలకృష్ణ ఉన్నారు.