బీబీనగర్, డిసెంబర్ 23 : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన గొల్ల, కురుమ సర్పంచులు, వార్డు సభ్యులను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం బీబీనగర్‌లో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముందుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ర్ట నాయకుడు దూదిమెట్ల బాలరాజు యాదవ్‌కు కళాకారులు, డప్పు చప్పుళ్లతో స్వాగతం పలికి ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ధి లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గొర్ల కాపరుల సంక్షేమ సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు గుండెబోయిన అయోధ్య యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోము రమేశ్ కురుమ, భువనగిరి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ చీర ఐలయ్య, నాయకులు గూదే శ్రీశైలం, సర్పంచులు కొమిరె శ్రీకాంత్, ఏర్పుల నాగరాజు, డబ్బికార్ రాజేశ్వర్, హుస్సేన్, పెరబోయిన లక్ష్మీనారాయణ, దవాడి సత్యనారాయణ, చింతల రఘుపతి, పొట్టినగారి జగన్, అందె యాదగిరి, ఉప సర్పంచ్ దాబాటి బాల పోచయ్య, దొడ్డి రమేశ్ కురుమ, ఉగ్గి నరసింహ కురుమ, గూదె వెంకటేశం, సారాజి కొండల్ పాల్గొన్నారు.

Bibinagar : గొల్ల-కురుమ సర్పంచులకు మాజీ మంత్రి తలసాని సన్మానం