రాజాపేట, మే 14 : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నేమిలె గ్రామంలో కోకట్ల నరసింహులు ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న 2005-06 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు బుధవారం మిత్రుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.32 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు నకీర్త కనకరాజు, నర్సింహులు, శ్రీను, భాస్కర్, మధు, డీలర్ యాదగిరి పాల్గొన్నారు.