రాజాపేట : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం పారుపల్లి గ్రామంలోని పాల ఉత్పత్తిదారుల ఆధ్వర్యంలో మదర్ డెయిరీ పాల బిల్లులు చెల్లించాలని పాల సంఘం ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత నాలుగు నెలల నుండి 8 నెలల బిల్లులు పెంగ్లో ఉన్నాయన్నారు.
పాలకులు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే లేనిచో మదర్ డైయిరీని రైతులందరూ కలిసి పెద్ద ఎత్తున ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, మాజీ చైర్మన్లు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.