రాజాపేట, మే 15 : సస్పెన్షన్కు గురైన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం దూది వెంకటాపురం సెక్టార్ ఏఈఓ ప్రీణీతను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దూది వెంకటాపురం ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో దళారులు విక్రయించడానికి వేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఏఈఓ తిరస్కరించింది. ఈ విషయాన్ని మండల అధికారులకు సైతం తెలిపారన్నారు. అలాంటిది ఉన్నతాధికారులు వచ్చి ఎలాంటి తప్పు చేయని, బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్న ఏఈఓను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.