కొల్లాపూర్, ఫిబ్రవరి 27 : ఇప్పుడు వచ్చేది ఎండకాలం అడవిలో ఆకు రాలే కాలం ఇప్పటికే కొల్లాపూర్ పరిసర ప్రాంతాలలో ఉష్టోగ్రతలు పెరుగుతున్నాయి. పొడి వాతావరణం బలమైన గాలుల వల్ల అగ్ని ప్రమాదాలు భారీ నష్టాన్ని కొనితేవచ్చు. నల్లమలలో ఉన్న కొల్లాపూర్ పరిసర ప్రాంతాలు అగ్ని ప్రమాదాలకు నెలవుగా ఉన్నాయి. సహజంగా లేదా మానవ తప్పిదం మూలంగా అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మంటలను నివారించేందుకు కొల్లాపూర్‌లోని ఫైర్ స్టేషసన్లో సరైన మౌలిక సౌకర్యాలు లేవు. కొల్లాపూర్ ఫైర్ స్టేషన్ పరిధి మొత్తం సున్నితమైన ప్రాంతం కానీ ఇక్కడ నీళ్లు లేవు, రోడ్డు లేదు దీంతో అనుకొని అగ్నిప్రమాదం జరిగితే కొల్లాపూర్ ఫైర్ ష్టేషన్ నుంచి ఆగ్నిమాపక వా హనం మొయిన్ రోడ్డుకు చేరుకునేలోపు జరిగే విపత్తు జరిగిపోతుంది.
కొల్లాపూర్ ఫైర్ స్టేషన్ పరిధిలో కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, పెంట్లవెల్లి మండలంతో పాటు, కొత్తకోట ఫైర్ స్టేషన్ పరిధిలోని చిన్నంబావి మండలంలో కూడా ఏదైన అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ కాల్ వచ్చిన వెంటనే వెళ్లాలి. కొల్లాపూర్ ఆగ్నిమాపక కేంద్రానికి వేసవిలో అనుక్షణం కత్తిమీద సాము చేసినట్లు ఉంటుంది. మంటలను ఆర్పేందుకు ఎన్నో అవంతరాలను దాటాల్సి వస్తోందని ఫైర్ సిబ్బంది పేర్కొంటున్నారు. కొల్లాపూర్ దట్టమైన నల్లమలలోనే అమ్రాబాద్ టైగర్ రిజర్వు జోన్ లో ఉన్నది. ఇక్కడ గ్రామాల్లో అగ్ని ప్రమాదాల కంటే నల్లమలలో జరిగే అగ్ని ప్రమాదాలు తరుచుగా జరుగుతుంటాయి. కానీ ఫైర్ స్టేషన్ అవసరాలకు తగ్గట్లుగా ఇక్కడ మౌలిక సదుపాయాలు లేవు.
అత్యవసర సమయాలల్లో ఫైర్ స్టేషన్‌కు పైర్ కాల్ చేస్తే ఫైర్ ఇంజన్ వచ్చేలోపు ఆలస్యమవుతున్నదని అగ్ని ప్రమాద బాధితులు ఆరోపిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఫైర్ స్టేషన్ నుంచి మొయిన్ రోడ్డుకు చేరుకోవడానికి 20 నిమి షాలు సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. ఫైర్ స్టేషన్ నుంచి మెయిన్ రోడ్డు వరకు ఉన్న మట్టి రోడ్డు మొత్తం గుంతలమయంగా ఉన్నది. 4500 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫైర్ వాహనం గుంతల రోడ్డుపై జాగ్రత్తగా పోవాల్సి వస్తోంది. ఏమాత్రం స్పీడ్‌గా వెళ్లేందుకు ప్రయత్నం చేసినా ఫైర్ వాహనం బోల్తా పడే అవకాశం ఉంటున్నదని ఫైర్ ఇబ్బంది పేర్కొంటున్నారు. ఇటీవల కొల్లాపూర్ పట్టణంలో జరిగిన అగ్ని ప్రమాదం లో మం టలు ఆ ర్పేందుకు ఫైర్ ఇంజన్ వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
సమస్యల వలయంలో కొల్లాపూర్ ఫైర్ స్టేషన్ చి క్కుకున్నది. కొల్లాపూర్ ఫై ర్ స్టేషన్‌కు ప్రధాన సమస్య రోడ్డుతో పాటు వాటర్ కనెక్షన్ సమస్య ఉన్నది. ఫైర్ స్టేషన్లో 500నుంచి 1000 గ్యాలన్ల నీటిని తీ సుకునే వెళ్లే వాహనం ఉంది. కానీ 20వేల లీట ర్ల సామర్థ్యం కలిగిన స్టో రేజీ సంప్ ఉండాలని రిటై ర్డు ఫైర్ అధికారులు సూచిస్తున్నారు. ఫైర్ స్టేషన్లో స్టోరే జీ సంప్ ఉన్నా ఇందులో ఉన్న బోరు కనెక్షన్ నుంచి వచ్చే నీళ్లు మా త్రం ఉప్పు నీళ్లు దీంతో పైర్ వాహనాలు దెబ్బతినే అవకాశం ఉంది.
మంటలను ఆ ర్పాడానికి వెళ్లేటప్పుడు ఫైర్ ఇంజన్ నుంచి లీకేజీలతో నీళ్లు వృథాగా పోతున్నాయని ప్రజలు తెలుపుతున్నారు. ఫైర్ వాహనాలు కూడా పాత పడిపోవడంతో వివిధ రకాల హోసులు, నిచ్చెనలు, ఎక్స్టెన్షన్ ల్యాండర్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఇతర పరికరాలు కొన్ని సందర్భాల్లో పని చేసేందుకు మొరాయించే అవకాశం ఉందని సంబంధిత నిపుణులు పేర్కొంటున్నారు. అగ్ని ప్ర మాదాలకే కాకుండా ఇతర అత్యవసర పరిస్థితుల్లో కూడా సహాయక చర్యలు చేపట్టేందుకు ఫైర్ స్టేషన్ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.