రాజాపేట, మార్చి 9 : మండలంలోని బేగంపేట వాగులో నుంచి అక్రమంగా ఇసుక(Illegal sand) తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామ రైతులు ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాగులో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని దాంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇసుక తరలింపు ఇలాగే కొనసాగితే భూగర్భ జలాలు అడుగంటి మండలమంతా ఎడారిగా మారుతుం దన్నారు. ఇసుక తరలింపు అడ్డుకొని రైతులను ఆదుకోవాలని కోరారు. అక్రమ ఇసుక తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బేగంపేట రైతులు పాల్గొన్నారు.