ఆలేరు టౌన్, సెప్టెంబర్ 30 : భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవాపక్షంలో భాగంగా మంగళవారం ఆలేరు పట్టణంలోని సామాజిక, సాహిత్య రంగాల్లో కృషి చేస్తున్న విద్యావేత్తలు బండిరాజుల శంకర్, పోరెడ్డి రంగయ్యను బిజెపి ఆలేరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నంద గంగేశ్, పట్టణ ప్రధాన, కార్యదర్శిలు సుంకరి సృజన్ కుమార్ గౌడ్, ఎలగల వెంకటేష్, జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ, జిల్లా కౌన్సిల్ మెంబర్ వడ్డేమాన్, నరేందర్, సేవా పక్షం కన్వీనర్ అయిలి సందీప్ గౌడ్, సేవా పక్షం కో కన్వీనర్ గుర్రం నరసింహులు, జిల్లా అధికార ప్రతినిధి తునికి దశరథ, సీనియర్ నాయకులు కళ్లెం రాజు గౌడ్, కటకం వెంకటేష్ పాల్గొన్నారు.