Dwajarohanam | యాదగిరిగుట్ట, మార్చి 2 : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నారసింహస్వామి (Sri Lakshmi Narasimha Swamy) వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ రెండవ రోజులో భాగంగా యాదగిరి శ్రీలక్ష్మీనారసింహస్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి ముక్కోటి దేవతలందరిని ఆహ్వానించడానికి గరుత్మంతుడిని వియుక్తం చేసే ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణంకు అర్చకులు, వేదపండితులు, రుత్వికులు, పారాయణందార్లు, యాజ్ఞిక బృందం శ్రీకారం చుట్టారు.
ఉదయం 10 గంటలకు ధ్వజారోహణ ఘట్టానికి ముందు ప్రధానాలయ వెలుపలి ప్రాకారంలోని అద్దాల మండపంలో యాగశాల ప్రవేశం, ధ్వారతోరణ, ధ్వజకుంభారాధన, మహాకుంభారాధన, చతుస్థానార్చన నిర్వహించారు. అనంతరం అగ్నిప్రతిష్ఠ. మూలమంత్ర, మూర్తిమంత్ర హోమాలు గావించారు.
ప్రత్యేకంగా గరుఢ ఆదివాసం, గరుఢ హోమ కార్యక్రమాలు నిర్వహించి, పూర్ణాహుతి కార్యక్రమం పాంచరాత్రగమశాస్త్రరీతిలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. గరుత్మంతుడు ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన గరుఢ ముద్దలను పైకి ఎగురవేసి పూజలు చేపట్టారు. సాయంత్రం అష్టదిక్పాలకులను ఆహ్వానించేందుకు భేరీపూజ, దేవతాహ్వానం నిర్వహించారు.
భేరీతాడవం మంత్రపూర్వకంగా నిర్వహించి బ్రహ్మోత్సవం నిర్విఘ్నంగా జరగాలని భగవదారాధనతో వివిధ రాగ, తాళాలతో అనేకమైన స్తోత్రపఠములతో అత్యంత భక్తి భరితంగా వేడుకను నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు 3వ రోజులో భాగంగా సోమవారం స్వామివారి అలంకార సేవలు ప్రారంభంకానున్నాయి.
Nidamanur | కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. పదిమంది మహిళలకు గాయాలు
Jawahar Nagar | 15 కోట్ల విలువైన సర్కారు భూమి కబ్జాకు యత్నం.. కంచెను ఖతం చేసిన కబ్జాదారుడు ఎవరు..?