ఆలేరు, సెప్టెంబర్ 07 : మాజీ మంత్రులపై పోలీసుల దాడి హేయమైన చర్య, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు. సోమవారం ఆలేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో రాహుల్ గాంధీకి ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయమా? వినాశకాలే విపరీత బుద్ది..రేవంత్ రెడ్డి పతనం ప్రారంభం అయిందన్నారు. ప్రభుత్వ దమనకండ అపకపోతే తగిన మూల్యం చరిల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఓ సైకో అని హోంమంత్రిగా ఉండి ప్రజా ప్రతినిధుల పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తుండని దుయ్యబట్టారు. అసెంబ్లీలా లేదని అది కౌరవ సభలా ఉందన్నారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రభుత్వం పారిపోయిందన్నారు. కావాలని కుట్ర ప్రకారం ప్రతిపక్షాలపై దమనకాండకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ చర్యలను ప్రజాస్వామ్య వాదులు, ప్రజలు గమనిస్తున్నారని రేవంత్ కు ప్రజాక్షేత్రంలో బుద్ది తప్పదు అన్నారు. కేటీఆర్కు గాయాలయ్యాయి, మహిళలను చీరలు పట్టి లాగడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు పద్దతిగా నడుచుకోవాలని లేదంటే రాబోయేది తమ ప్రభుత్వమేనని తప్పక బుద్ది చెబుతామని బూడిద భిక్షమయ్య గౌడ్ హెచ్చరించారు.