– బీఆర్ఎస్ ఆలేరు సోషల్ మీడియా ఇన్చార్జి ఎండీ జమాల్
ఆలేరు టౌన్, మార్చి 24 : బీఆర్ఎస్వీ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం హేయమైన చర్య అని బీఆర్ఎస్ ఆలేరు పట్టణ సోషల్ మీడియా ఇన్చార్జి ఎండీ జమాల్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఉదయం నిద్ర లేవక ముందే ఇంటికి వచ్చి తలుపులు కొట్టి ముందస్తు అరెస్టు చేయడం ఇదేనా ప్రజా పాలన అంటే అని ఆయన ప్రశ్నించారు. గ్రౌండ్లో వాకింగ్ చేస్తున్న వారి వద్దకు వెళ్లి సంతకాలు తీసుకుని పోలీస్ స్టేషన్కు రావాలని చెప్పడం అప్రజాస్వామికమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. రేవంత్ రెడ్డి సర్కారు నిర్బంధాలు, అరెస్టులు, కేసులు పెట్టి బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తూ పాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు. అరెస్ట్ అయిన వారిలో ఏఎంసీ మాజీ డైరెక్టర్ పత్తి వెంకటేశ్, పార్టీ ఇతర నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.