భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 07 : అర్హులైన నిరుపేదలకు ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం యాదాద్రి భువనగిరి కలెక్టర్ కార్యాలయం ముందు సమస్యల పరిష్కారం కోసం లబ్ధిదారులతో కలిసి ధర్నా నిర్వహించి మాట్లాడారు. ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 8లో మూడు ఎకరాలు ఖాళీగా ఉన్నందున అర్హులైన పేదలకు ఇవ్వాలన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో రెండు మాసాలుగా పోరాటాలు చేస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలను గుర్తించి ఇంటి స్థలం ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఇవ్వాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ వీరారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ శాఖ కార్యదర్శి పొన్నబోయిన రవి, నాయకులు పోతు ప్రవీణ్, యాట ఉపేందర్, భూ పోరాట కమిటీ సభ్యులు మోతే భవాని, సంపత్, పార్వతి, సంధ్య, సరిత, యాదమ్మ, శ్యామల, ఎల్లమ్మ, క్రాంతికుమార్, లక్ష్మి, నరసమ్మ, ఉపేంద్ర పాల్గొన్నారు.