రామన్నపేట, జూన్ 18 : రామన్నపేట దవాఖానా స్థాయిని 100 పడకలకు పెంచి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జెల్లెల పెంటయ్య, రామన్నపేట మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని దవాఖానా గేటు ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం చిట్యాల-భువనగిరి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 50 ఏండ్లుగా ప్రజలకు సేవలందిస్తూ దినదినాభివృద్ధి చెందాల్సిన ఆస్పత్రి శిథిలావస్థకు చేరిందన్నారు.
ఆస్పత్రి పైకప్పు పెచ్చులు ఊడి రోగులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేకమార్లు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు విన్నవించినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. డాక్టర్లను, సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. దవాఖానా సూపరింటెండెంట్ చిన్నానాయక్ తమ పరిధిలోని సమస్యలను పది రోజుల్లో పరిష్కరిస్తానని, ఇతర సమస్యలను పైఅధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వనం ఉపేందర్, బల్గూరి అంజయ్య, బోయిని ఆనంద్, కందుల హనుమంతు, కల్లూరి నగేశ్, జంపాల అండాలు, నాగటి ఉపేందర్, మీర్ఖాజా, బావండ్లపల్లి బాలరాజు పాల్గొన్నారు.
Ramannapet : రామన్నపేట దవాఖానాను వంద పడకలకు పెంచాలని ధర్నా