– నూతన కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్
భూదాన్ పోచంపల్లి, జూలై 18 : పురపాలక కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అక్రమంగా ఏర్పాటు చేసిన దేవాలయ ట్రస్టును రద్దు చేయాలని, ట్రస్టు సభ్యుల ఏకపక్షం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ శనివారం అయ్యప్ప దేవాలయం ఎదుట గురుస్వాములు, భక్తులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేవాలయానికి సంబంధించిన అయ్యప్ప భక్తులు, గురుస్వాములకు సమాచారం, అనుమతి లేకుండా ట్రస్ట్ ను ఏర్పాటు చేయడంతో దేవాలయ అభివృద్ధి కుంటుపడుతుందని ఆరోపించారు. దొంగతనంగా ట్రస్ట్ ఏర్పాటు చేశారని, గత 30 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి దేవాలయం అభివృద్ధికి సేవ చేస్తున్నామని ట్రస్ట్ కమిటీలో నలుగురు ప్రతినిధులు ఉన్నారని తెలిపారు.
దేవాలయ అభివృద్ధి కోసం అన్ని కులాలు, సర్వ సభ్యుల సమక్షంలో మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దేవాలయ అభివృద్ధి కోసం అందరిని కలుపుకుని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు శెట్టి శ్రీనివాస్, దొంత సుదర్శన్, బొడిగే బాబు, తండ వెంకటేష్ గౌడ్, రేపాక జగన్, గంగాపురం వెంకటేశ్ గౌడ్, బొడిగ లింగం, రచ్చ రామకృష్ణ, భోగ విష్ణు, గుండు శ్రీరాములు, కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, తండ రమేష్, వంగూరి పాండు, దోర్నాల గణేష్, కీర్తి సంజీవ, ముప్పిడి శ్రీనివాస్, అంకం వినోద్, అంకం సాయి, శంకర్, పగిడిమర్రి రాజు, వీరేష్, సాయి, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.