యాదాద్రి, భువనగిరి : భక్తుల కొంగు బంగారంగా కొలువబడుతున్న యాదాద్రి (Yadadri) లక్ష్మినరసింహస్వామి (Lakshminarasimhaswamy ) ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసానికి తోడు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో లక్ష్మి నరసింహ స్వామివారి ధర్మ దర్శనానికి నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతుందని ఆలయ అధికారులు వివరించారు.