చౌటుప్పల్: హరితహారం నిర్వహణలో యావత్ దేశానికే తెలంగాణ ఆదర్శంగా మారిందని సీసీఎఫ్(చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) ఎంజే అక్బర్ తెలిపారు. 2015లో మొదలు పెట్టిన హరితహారంలో ఈ ఐదేండ్లలో అనుకున్న టార్గెట్ ప్రకారం రూ.230కోట్ల మొక్కలు నాటి రికార్డు సృష్టించామని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని లక్కారంలోని తంగేడు వనాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. అక్కడ పెంచిన యాదాద్రి నేచురల్ ఫారెస్ట్‌ను పరిశీలించారు. రెండేండ్లలో చిట్టడివిని పెంచడం పట్ల ఫారెస్ట్ సిబ్బందిని అభి నందించారు.
అనంతరం స్థానిక ఫారెస్ట్ కార్యాలయంలో డీఎఫ్‌వో వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవో రాకేశ్రావుతో సమావేశమై హరితహారంలో భాగంగా పెంచిన మొక్కల వివరాలు అడిగి తెలుసు కున్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 ముందు తెలంగాణలో అటవీ విస్తీర్ణం పూర్తిగా పడిపోయిందని, సీఎం కేసీఆర్ ఇచ్చిన జంగల్ బడా వో.. జంగల్ బచావో పిలుపు మేరకు పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టామన్నారు.
గతంలో కనిపించకుండా పోయిన పెద్ద పులులు రాష్ట్రంలోని ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో ప్రస్తుతం పెంచిన అడువుల్లో సాక్షా త్కరిస్తున్నాయని తెలిపారు. చెట్ల పెంపకం వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి భూగర్భ జలాలు పెరుగుతాయని, భూతాపం నుంచి ఉపశమనం కలుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలో హరితహారం పండుగ వాతావరణంలో జరుగుతుందని, గ్రామాలన్నీ పచ్చని వనాలుగా మారుతున్నాయని తెలిపారు.
అన్ని పల్లెల్లో పల్లె పకృతి వనాలు, అర్బన్ ప్రాంతాల్లో అర్బన్ పార్క్‌లను పెరుగుతున్నాయన్నారు. గ్రామపంచాయతీ లు, మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీల్లో 10శాతం నిధులు చెట్ల పెంపకానికి వినియోగిస్తున్నారని తద్వారా పెద్ద ఎత్తున మొక్కల పెంపకం జరుగుతుందన్నారు. చౌటుప్పల్ పరిధిలో పెంచిన యాదాద్రి నేచురల్ ఫారెస్ట్ రాష్ర్టానికే ఆదర్శంగా మా రిందని, అన్ని మండలాలు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఈ తరహా అడువుల పెంపకం చేపడుతున్నామన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌లో 100పైగా ఫారెస్ట్ బ్లాక్‌లు ఉన్నాయని తెలిపారు. జాతీయ రహదారి వెంట నాలుగు, ఐదు వరుసల్లో మొక్కల పెంపకం చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా గడ్డి మైదానాల పెంపకం చేపడుతున్నామని, అంతరించిన జింకలు ఈమైదానాల్లో తిరిగి కనిపిస్తున్నాయన్నారు.
గ్రామాల్లోని కోతులను తిరిగి అడువుల్లోకి వాపస్ పంపించేందుకు మంకీ ఫాట్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపా రు. లక్కారంలో ఏర్పాటు చేసిన తంగేడువనాన్ని అన్ని పాఠశాలలు, కళాశాల విద్యా ర్థులు సందర్శించేలా ప్రత్యేక ప్రణాళి క రూపొందిస్తున్నామని తెలిపారు. ఆయన వెంట డీఎఫ్‌వో వెంకటేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ ఎఫ్ఆర్వో వెంకట్రాములు, ఫారెస్ట్ సిబ్బంది ఉన్నారు.