భువనగిరి కలెక్టరేట్: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించి ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు భరోసా కల్పించాలని కలె క్టర్ పమేలా సత్పతి కోరారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రాథమిక ఆరో గ్య కేంద్రాల వైద్యాధికారులు, పోగ్రాం అధికారులతో కలెక్టర్ సమావేశమై ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు, పారిశుధ్య చర్యలపై సమీక్షించారు. జిల్లాలోని అన్ని ఆరోగ్య కేం ద్రాలు వచ్చే నెల 15వ తేదీలోగా క్లీన్ ఆండ్ గ్రీన్‌గా కనిపించాలని పారిశుధ్య చర్యలు మెరుగు పడాలని ఆదేశించారు.
అవసరాన్ని బట్టి సర్పంచ్‌లకు పంచాయతీరాజ్ శాఖకు తగు ఆదేశాలిస్తామని, దవాఖాన ఆవరణలో మాత్రం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యం లో జరగాలని, ఇందుకు అవసరమైన నిధులకు ప్రతిపాదనలు పంపాలన్నారు. అందుబాటులో ఉన్న నిధులను వినియోగించి మరమ్మతు పను లకు తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. దవాఖానలోని ప్రవేశ ద్వారం వద్ద ఉండే డోర్‌మ్యాట్ స్థాయి నుంచి నీట్‌గా కనిపించాల ని చూడగానే ప్రజలకు ప్రభుత్వ దవాఖానకు మాత్రమే వెళ్లాలనే నమ్మకం కలగాలని డాక్టర్లను ఆదేశించారు.
ప్రతి నెల డాక్టర్లంతా కలిసి మండలంలోని ఒక మారుమూల గ్రామాన్ని గుర్తించి మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కోరా రు. డెంగీ అతిసార, మలేరియా వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండి వైద్య సేవలందించాలని, ఈ విషయంలో రోజు వారీగా నివేదికలు సమ ర్పించాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ చేపట్టడంతో పాటు వైద్య పరీక్ష ల స్థాయి పెరగాలన్నారు. కరోనా థర్డ్ వేవ్ ఉదృతి విషయంలో అప్రమత్తంగా ఉండి సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో పంచాయతీరాజ్, ఐసీడీఎస్ ఇతర శాఖలను సమన్వయం చేసుకోవాలని తద్వారా ఆరోగ్య సేవలం దించడంలో న్యాయం చేకూర్చాలన్నారు. అడ్డగూడూరు, గుండాల దవాఖానల పనితీరు మెరుగు పడేలా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. పనితీరులో మార్పు లేకుంటే తగు చర్యలు తప్పవని, డాక్టర్లు సిబ్బంది విధిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. వచ్చే సమావేశంలో డాక్టర్ల వారీగా, దవాఖానల వారీగా పనితీరు సమీక్షిస్తామన్నారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.