న్యూఢిల్లీ, మార్చి 3 : ఇండోనేషియాలోని సుమిత్రా ద్వీపంలో మంగళవారం భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదైందని యూఎన్ జియోలజికల్ సర్వే పేర్కొంది. ఎక్కువగా భూకంపాలు వచ్చే ఈ సుమిత్రా ద్వీపం సమీపంలోని సముద్ర జలాల్లో ఈ ప్రకంపనలు వచ్చినట్టుగా గుర్తించారు.
దీని కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు అధికారికంగా ధ్రువీకరించలేదు. రింగ్ ఆఫ్ ఫైర్‌లో భాగమైన ఈ ప్రాంతంలో తరచూ భూకంపాలు, అగ్ని పర్వత విస్ఫోటనాలు జరుగుతుంటాయి. నిరుడు నవంబర్లోనూ ఆషే ప్రావిన్స్ సమీపంలో రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రత భూకంపం సంభవించింది.