ఆత్మకూరు(ఎం), అక్టోబర్ 25 : ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని 32 మంది ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి రూ.550తో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గడ్డం దశరథ గౌడ్ రూ.10 లక్షల పోస్టల్ ప్రమాద బీమా చేయించారు. శనివారం బీమా పత్రాలను, బ్యాంక్ అకౌంట్ కార్డులను వారికి అందజేశారు. ఈ సందర్భంగా దశరథ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత బస్ ప్రయాణంతో ఆటో డ్రైవర్ల కుటుంబాలు బజారులో పడ్డాయన్నారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని ప్రకటించి నేటి వరకు కూడా ఇవ్వకుండా మోసం చేసిందని దుయ్యబట్టారు.
ఆటో డ్రైవర్లు, వారి కుటుంబాల భద్రత కోసం ప్రమాద బీమా చేయించినందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ దశరథ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు దశరథ, ఎలగందుల విజయ్ కుమార్ వెంకన్న, స్వామి, మల్లేశ్, జహంగీర్, మహేశ్, కిష్టయ్య, జ్ఞానేశ్వర్, శ్రీధర్, షానూర్ పాల్గొన్నారు.