యాదగిరిగుట్ట, సెప్టెంబర్21: రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లించిన తరువాతనే నార్మూల్ సంస్థ ఎన్నికలు నిర్వహించడంతో పాటు పలు డిమాండ్స్ నెరవేర్చాలని కోరుతూ యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాడి రైతుల నిరాహార దీక్ష నిర్వహించారు. గత 40 సంవత్సరాలుగా యాదాద్రి, చెర్వుగట్టు, వేములకొండ, కీసర ఇట్టి దేవాలయాలకు పంపిణీ చేసే నెయ్యిని నిలిపివేశారు. ఈ నెయ్యిని పంపిణీని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలు ప్రభుత్వ హాస్టళ్లకు పంపిణీ చేస్తున్న 12 వేల లీటర్ల పాలను నిలిపివేసినందున వెంటనే వాటిని పునరుద్దరించాలని కోరారు.
గత కొన్ని సంవత్సరాలుగా మదర్, విజయ పేరుతో పంపిణీ చేస్తున్న పాల పదార్థాలను నిలిపివేశారు. పాల పదార్థాలను వెంటనే పంపిణీ చేయాలన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఎమ్మెల్యేలు గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుండి 30 కోట్ల రూపాయల గ్రాంట్ ను, పెండింగ్ లో ఉన్న రూ.4 ప్రోత్సాహం బిల్లును అమలు చేయాలన్నారు.
నార్ముల్ మదర్ డైయిరీని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పాక్స్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, నార్మూల్ డైరక్టర్లు మోతె సోమి రెడ్డి, మాజీ డైరెక్టర్లు ఒగ్గు బిక్షపతి, భాస్కర్ గౌడ్, పాల సంఘం చైర్మన్లు మారెడ్డి కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.