భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 29 : కబేలాలకు తరలిస్తున్న గోవులను పట్టుకున్నట్టు భూదాన్ పోచంపల్లి ఎస్ఐ కంచర్ల భాస్కర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తునికి నుండి ఆవల నానాజీ, రుత్తల రమేశ్, గోళ్లు వెంకటరమణ ముగ్గురు వ్యక్తులు అక్రమంగా హైదరాబాదులోని బహుదూర్పేటలోని కబేలాలకు తరలిస్తుండగా పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామ శివారులో పట్టుకున్నట్లు తెలిపారు. రాజపేట మండలంలోని చల్లూరు సహాయోగ నందిషాల గోశాలకు గోవులను తరలించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.