బీబీనగర్, డిసెంబర్ 08 : బీబీనగర్ మండలం పడమటి సోమారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన 40 కుటుంబాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు సోమవారం మాజీ ఎంపీపీ ఎరుకల సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థి బద్దం అంజయ్య, దాసన్న ఫౌండేషన్ చైర్మన్ తంతరపల్లి ప్రదీప్ కుమార్ గౌడ్, దేశం శ్రీనివాస్ గౌడ్, ఆముధాల సదానందం, నూనె రాములు, బద్దం రామలింగం, బద్దం ఉపేందర్, తంతరపల్లి దిలీప్ కుమార్, బొమ్మగోని విజయ్, బద్దం మహేశ్వరం, బద్దం హరిబాబు, బుర్రి మోహన్, నూనె భరద్వాజ్, బద్దం వంశీ, బద్దం లోకేష్‌తో పాటు మరో 40 కుటుంబాలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, రైతు సమన్వయ సమితి చైర్మన్ బొక్క జైపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ తలబోయిన గణేశ్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆల్వ మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ జంగయ్య యాదవ్, దేవాలయ మాజీ చైర్మన్ వాకిటి బస్వరెడ్డి పాల్గొన్నారు.