ఆత్మకూరు(ఎం), అక్టోబర్ 06 : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ ఆత్మకూరు(ఎం) మండలాధ్యక్షుడు బీసు చందర్ గౌడ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పీఎస్ గార్డెన్లో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్ని కల సమయంలో అమలుకు సాధ్యం కాని హామీలు గుప్పించిన కాంగ్రెస్, అధికారంలోకి రాగానే వాటిని విస్మరించిందని దుయ్యబట్టారు. అధికార పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు మరిచిపోయారన్న భ్రమలో కాంగ్రెస్ నేతలు ఉన్నారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ అభయహస్తం ఆ పార్టీ పాలిట భస్మాసుర హస్తంగా మారిందన్నారు. రాబోవు బీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు కొప్పుల హరిదీప్ రెడ్డి, జిల్లా నాయకులు యాస ఇంద్రారెడ్డి, పూర్ణచందర్ రాజు, బీసు ధనలక్ష్మి, మండల మాజీ అధ్యక్షుడు భాషబోయిన ఉప్పలయ్య, మాజీ ఎంపీపీ హేమలత, మాజీ వైస్ ఎంపీపీలు రాములు, మల్లేష్, సెక్రటరీ జనరల్స్ పంజాల వెంకటేష్, రంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ యాస కవిత, మాజీ సర్పంచులు నరసింహారెడ్డి, సత్తయ్య, గనగాని మాధవి మల్లేష్, మహిళా విభాగం అధ్యక్షురాలు సోలిపురం అరుణ, బీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ ప్రవీణ్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు శాంతన్ రాజ్,బీటిఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు చుంచు నాగరాజు, యాస మహేందర్ రెడ్డి, హైమద్, పందాల రాజు, గడ్డం సతీష్, మాద నరేష్, నాగరాజు పాల్గొన్నారు.