చౌటుప్పల్, నవంబర్ 27 : కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీని నిందించి లబ్ధి పొందాలని అనుకోవడం సిగ్గుచేటని, ఇలాంటి నీతిమాలిన రాజకీయాలు తక్షణమే మానుకోవాలని ఆ పార్టీ చౌటుప్పల్ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్ అన్నారు. బుధవారం అర్ధరాత్రి మండల పరిధిలోని దండు మల్కాపురం, తూప్రాన్ పేట గ్రామాల్లోని కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మెలను ధ్వంసమైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీపై అధికార పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జెండా దిమ్మెలను కూల్చివేసిన వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా కూడా బీఆర్ఎస్ పై నింద మోపడం సరైంది కాదన్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమి జరిగినా కూడా బీఆర్ఎస్ పై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
అయినప్పటికీ జెండాలు కూల్చివేసిన అల్లరి మూకలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. జెండా దిమ్మెలను ధ్వంసం చేయడం ఏ రాజకీయ పార్టీకి సరైంది కాదన్నారు. కానీ అన్ని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మున్సిపాలిటీ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ ఊడుగు మల్లేశం గౌడ్, నాయకులు చిన్నం బాలరాజ్, ముప్పిడి శ్రీనివాస్ గౌడ్, జక్కిడి జహిందర్ రెడ్డి, చౌట వేణుగోపాల్ గౌడ్, మెట్టు మహేశ్వర్ రెడ్డి, పబ్బతి ఆంజనేయులు గౌడ్, బచ్చ రామకృష్ణ, బాతరాజు యాదయ్య, ఎండి మునీర్, కొయ్యలగూడెం వెంకటేశం, వల్లందాస్ సతీశ్ పాల్గొన్నారు.