ఆత్మకూరు(ఎం), నవంబర్ 24 : ఆత్మకూరు(ఎం) మండలంలోని కప్రాయపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు దేవినేని సంతోష్ కుమార్ సోమవారం యాదగిరిగుట్టలో డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తుందన్నారు. రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్లీ అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రేణులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు కాంబో భాను ప్రకాష్, బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ దేవరపల్లి ప్రవీణ్ రెడ్డి, యువజన విభాగం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి నూనె ముంతల విజయ్ కుమార్, శ్రవణ్ కుమార్, వీరారెడ్డి పాల్గొన్నారు.