యాదాద్రి: వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు సాయం అందించడమే ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ప్రధాన లక్ష్య మని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యంతో యాదగిరిపల్లికి చెందిన రాజేశ్వరి నిమ్స్‌లో చికిత్స పొందుతుండగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.3లక్షల ఎల్వోసీ మంజూరైంది. ఈ సందర్భంగా శనివారం యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లిలో లబ్ధిదారు బంధువులకు ఎల్వోసీని అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరంలాంటిదని అన్నారు.
పేదల ఆనారోగ్యం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం సహాయనిధి మంజూరులో గణనీయమైన మార్పులు వచ్చాయని, ప్రతిఒక్కరికీ సహాయ నిధి అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల సెక్రటరీ జనరల్ కసావు శ్రీనివాస్‌గౌడ్, పట్టణ మహిళా విభాగం నాయకురాలు ముఖ్యర్ల అండాలు, వంగపల్లి ఎంపీటీసీ రేపాక మౌనిక, రైతుబంధు సమితి జిల్లా డైరక్టర్ మిట్ట వెంకటయ్య, మున్సిపల్ కో ఆప్షన్‌సభ్యురాలు గోర్ల పద్మ, నాయకులు ఆరె మల్లేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.