బీబీనగర్, జూన్ 29 : అతివేగంతో వచ్చిన కారు అదుపుతప్పి ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌కు చెందిన చెమన్‌సింగ్ ఆదివారం ఉదయం తన కారులో బీబీనగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామం వైపునకు వెళ్తున్నాడు. గ్రామ సమీపంలోకి చేరుకోగానే కారు అదుపుతప్పి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స కోసం భువనగిరి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా ధ్వంసం అయ్యింది. లైన్మెన్ కందుకూరి స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.