మోత్కూరు, మే 31 : మోత్కూరు, అడ్డగూడూరు మండలాల రైతులకు సాగు నీరందించే బునాదిగాని కాల్వను సత్వరమే పూర్తి చేయాలని సీపీఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కౌన్సిల్ సమావేశం స్థానిక కేఆర్ భవనంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న దామోదర్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు రుణమాఫీని పూర్తి చేయాలన్నారు. షరతులు లేకుండా ఇందిరమ్మ లబ్ధిదారులను ఎంపిక చేసి రూ.5 లక్షలను ఇవ్వాలన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, రైతాంగ వ్యతిరేక విధానాలపై నిరంతరం తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
గొలుసుల యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మోత్కూరు పట్టణ శాఖ కార్యదర్శిగా బోయిన ఉప్పలయ్య, సహయ కార్యదర్శులుగా గొలుసుల యాదగిరి, కడమంచి వీరస్వామి, కొండగడప శాఖ కార్యదర్శిగా తొంట తిరుపతయ్య, పాటిమట్ల శాఖ కార్యదర్శిగా దొండ రాములు, దాచారం కార్యదర్శి గా సిగిరి మత్స్యగిరి, బుజిలాపురం శాఖ కార్యదర్శిగా చేతరాశి సత్తయ్య, పొడిచేడు శాఖ కార్యదర్శిగా ఎర్రబాబు, దత్తప్పగూడెం కార్యదర్శిగా వల్లపు అంతయ్య, ముశిపట్ల కార్యదర్శులుగా ఎండీ అబ్బాస్, అలీను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి అన్నెపు వెంకట్, గీత పనివారల సంఘం జిల్లా అధ్యక్షుడు చాపల అంజయ్య, నాయకులు మల్లేశం, పోచం కన్నయ్య, పెండెం వెంకటేశ్వర్లు, జంగ నర్సయ్య, అశోక్, లక్ష్మీనర్సయ్య, ఆనంద్ పాల్గొన్నారు.