భూదాన్ పోచంపల్లి, జనవరి 04 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ చేపట్టిన పలు సంక్షేమ పథకాలు తమకు శ్రీరామ రక్షగా నిలుస్తాయని, ప్రజల మద్దతు తమకు ఉందని మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేష్ అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి పట్టణంలోని 10వ వార్డులో పార్టీ అభ్యర్థి చేరాల లహరి కిరణ్ ప్రచార కార్యక్రమం ముమ్మరంగా నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులు చేపట్టిన బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్చార్జి కోట మల్లారెడ్డి, చిలువేరు బాల నరసింహ, నాయకులు సార బాలయ్య, చిలువేరు బాల నరసింహ, తంగెళ్ల దశరథ, చేరాల చిన్న నరసింహ, వంగూరి రాము, కొయ్యడ కిరణ్, సయ్యద్ అజ్జు పాల్గొన్నారు.