యాదాద్రి భువనగిరి : ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చేతికొచ్చిన పంట కండ్ల ముందే వర్షార్పణం అవుతుంటే కడుపుమండిన రైతులు రోడ్లపై కొచ్చి ఆందోళనలు చేపడుతున్నారు.
తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఇబ్బందులను తొలగించాలని కోరారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.