రుద్రంపూర్, ఆగస్టు 15 : విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన సింగరేణి కొత్తగూడెం ఏరియా ఎస్ అండ్ పిసి స్పెషల్ టీం, ఇంటలిజెన్స్ విభాగంలో పని చేస్తున్న సిబ్బందిని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అభినందించారు. సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని ప్రొఫెసర్ జయశంకర్ మైదానంలో శనివారం నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా విశిష్ట సేవలు అందించిన S&PC సిబ్బందికి కామెండేషన్ సర్టిఫికెట్లు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ ప్రశంసా పత్రాలను కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సిహెచ్.వెంకటరమణ చేతుల మీదుగా S&PC సిబ్బంది అందుకున్నారు.
విధి నిర్వహణలో అంకితభావంతో, బాధ్యతాయుతంగా సేవలందిస్తూ సంస్థ భద్రత, క్రమశిక్షణ, సంస్థ ఆస్తుల పరిరక్షణకు కృషి చేసిన సిబ్బందిని ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ అభినందించారు. విశిష్ట సేవలకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలు అందుకోవడం సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని పేర్కొన్నారు. వీరి వెంట ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష్ ఉన్నారు. పత్రాలు అందుకున్న వారిలో స్పెషల్ టీం జమేదార్ కే ఎం. విక్టర్, కప్పల శ్రీనివాస్, లెనిన్ బాబు, ఎన్ వెంకటేశ్వర్లు, ఇంటెలిజెన్స్ విభాగం జనార్ధన్, మల్లికార్జున్ ఉన్నారు.

విశిష్ట సేవలకు ఎస్ అండ్ పిసి సిబ్బందికి ప్రశంసా పత్రాలు