ఆలేరు టౌన్, జులై 13 : ఆలేరు పట్టణంలోని 12 వ వార్డుకు చెందిన కొరుటూరి నర్సమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు వస్పరి ఫౌండేషన్ సౌజన్యంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయంగా 50 కేజీల బియ్యం అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఆలేరు పట్టణంలోని పేద ప్రజలకు చేయూతను అందించడమే వస్పరి ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఆలేటి బాలకిషన్, సీనియర్ నాయకులు గొర్రె కాపరుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జల్లి నరసింహులు, యూత్ నాయకులు జింకల భరత్, వార్డు జనరల్ సెక్రటరి బింగి సత్యనారాయణ, చిమ్మి శివమల్లు, కొర్టూరి ఇస్తారి, కోరుటూరు నరసింహులు, పాల్గొన్నారు.