రాజాపేట, సెప్టెంబర్ 16 : రాజాపేట మండలంలోని కుర్రారం గ్రామానికి చెందిన ఎర్రగుంట నరసయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆర్వీఎంలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలిసిన బీఆర్ఎస్ మండల నాయకుడు బొడ్డు భాస్కర్ మంగళవారం ఆస్పత్రికి వెళ్లి నర్సయ్యను పరామర్శించాడు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని వైద్య ఖర్చుల కోసం రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జూకంటి బాలస్వామి, నందా ఐలయ్య, సోలిపురం గోపాల్, ఊట్కూరి భాను గౌడ్ పాల్గొన్నారు.