బీబీనగర్, ఏప్రిల్ 06 : బీబీనగర్ మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ సర్పంచ్ గాదె ఇంద్రారెడ్డి, నీటి సంఘం మాజీ డైరెక్టర్ నోముల బలరాం రెడ్డి, పార్టీ నాయకుడు జిల్కపల్లి బసవయ్య ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా జిల్కపల్లి బాలరాజ్, ఉపాధ్యక్షుడిగా నోముల మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నోముల ప్రశాంత్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా ఉల్లంతల సత్యనారాయణ, కోశాధికారిగా మిర్యాల మహేందర్, సోషల్ కన్వీనర్‌గా ఏర్నాగి కోటయ్యను ఎన్నుకున్నారు. యువజన విభాగం అధ్యక్షుడిగా జాల శ్రీకాంత్, ఉపాధ్యక్షుడిగా కవ్వాడి ప్రశాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జిల్కపల్లి రవీందర్, సంయుక్త కన్వీనర్‌గా దుర్గం నరేష్, కోశాధికారిగా నోముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచులు మిర్యాల ఆంజనేయులు, గంగాధరి ఐలయ్య, బీఆర్ఎస్ మండల నాయకులు పల్ల శ్రీనివాస్ రెడ్డి, బిట్ల రవీందర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యుడు కవ్వాడి లక్ష్మారెడ్డి, జిల్కపల్లి బాలరాజు, నోముల బాల్ రెడ్డి, నోముల భాస్కర్ రెడ్డి, జిల్కపల్లి వెంకటేష్, రాజు, జాల మహేష్, ఎల్లంల లింగస్వామి, దుర్గం రమేష్, నోముల దేవేందర్ రెడ్డి, కుందనపల్లి మల్లేష్, మిర్యాల మల్లేష్ పాల్గొన్నారు.