ఆలేరు టౌన్, జులై 03 : ఈ నెల 5న యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ ఆలేరు పట్టణాధ్యక్షుడు పుట్ట మల్లేశం గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసేందుకు ఉదయం 6 గంటలకు వస్తున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, జిల్లా, రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మండలాధ్యక్షుడు, పట్టణాధ్యక్షులు, మాజీ పీఏసీఎస్ చైర్మన్లు, అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, పట్టణ వార్డు అధ్యక్షులు గిరి ప్రదక్షణలో పాల్గొననున్నట్లు వెల్లడించారు.
అనంతరం ఉదయం 9 గంటలకు స్థానిక యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్ లో జరిగే నియోజకవర్గస్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా హరీష్ రావు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు పట్టణ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మొరిగాడి వెంకటేశ్ గౌడ్, పట్టణ సెక్రటరీ జనరల్ గుండె సంపత్ కుమార్, మాజీ జిల్లా ఆర్టీఏ మెంబర్ పంతం కృష్ణ, మాజీ కౌన్సిలర్లు బేతి రాములు, రాయపురం నరసింహులు, పాషికంటి శ్రీనివాస్, జింకల రామకృష్ణ యాదవ్, జల్లి నరసింహులు, జింకల భరత్ యాదవ్, ఎండీ ఫయాజ్ పాల్గొన్నారు.