భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 07 : అసెంబ్లీలోకి వెళ్లకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు నిరంకుశంగా దాడి చేసి అక్రమ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ భూదాన్ పోచంపల్లిలో సోమవారం నేతాజీ ప్రధాన చౌరస్తా వద్ద ఆ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని, ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రతిపక్షాలపై ధమనకాండకు పాల్పడుతుందన్నారు. ప్రభుత్వ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజా క్షేత్రంలో సీఎం రేవంత్ కు తగిన బుద్ధి చెబుతారన్నారు. మహిళను చీర పట్టి లాగడం ఏంటని, పోలీసులు పద్ధతిగా నడుచుకోవాలని, రేవంత్ రెడ్డి పతనం ప్రారంభమైందన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కందాల భూపాల్ రెడ్డి, కౌన్సిలర్ బాతుక లింగస్వామి, కుడికాల అఖిల బలరాం, మాజీ కౌన్సిలర్ గుండు మధు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చిలువేరు బాల నరసింహ, పట్టణ కార్యదర్శి సీత శ్రీనివాస్, నాయకులు కందాల సుధాకర్ రెడ్డి, మునుకుంట్ల బాలచందర్, కర్నాటి నరసింహ, మంగళపల్లి శ్రీహరి, చింతకింది కిరణ్, పగిడిమర్రి రాజు, నోముల ఉపేందర్ రెడ్డి, కొండమడుగు రవి, కర్నాటి అంజమ్మ, గుండు రాజేశ్వరి, భారత కల్పన, రమావత్ రాజు, శంకరయ్య, సరసాని నర్సిరెడ్డి, రేవల్లి శ్రీను, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు .