హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ హైకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ)గా బీ నరసింహశర్మను మరో మూడేండ్లపాటు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు నరసింహశర్మను పునర్నియామకం చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
అక్టోబరు 17 నుంచి మరో మూడేండ్లపాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు.